Diwali celebrations at Megastar Chiranjeevi Home: దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా దీపావళి సంబరాలను అభిమానులతో పంచుకోగా.. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో జరిగిన దీపావళికి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అభిమానులతో పంచుకున్నారు.





