Saturday, November 15, 2025
Homeగ్యాలరీBanana fruit: అరటి పండు ఎందుకు వంకరగా ఉంటుందో తెలుసా..?

Banana fruit: అరటి పండు ఎందుకు వంకరగా ఉంటుందో తెలుసా..?

Banana benefits: అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న నుంచి మొదలు పెద్దల వరకు దీన్ని ఇష్టపడని వారు ఉండరు. తక్షణ ఎనర్జీ కోసం క్రీడాకారులు అరటి పండును ఎక్కువగా తింటుంటారు. అయితే ఎప్పుడైనా మీరు గమనించారా? అరటి పండు అనేది ఎందుకు వంకరగా ఉంటుందో తెలుసుకున్నారా? లేదు కదూ..అయితే ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండులో పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా తక్షణ ఎనర్జీ కోసం ప్రోటీన్‌లు కూడా ఉంటుంది. దీంతో ఇవి అలసట, బలహీనతను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జ్ఞాపకశక్తిని సైతం పెంచుతుందని తెలిపారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను సైతం క్రమబద్ధం చేస్తుంది.
అరటి చెట్లు సూర్యకాంతిని ఎక్కువగా ఆకర్షిస్తాయంట. ఈ మొక్కలు సూర్యకాంతి వైపు తమ పెరుగుదలను జరుపుతుంటాయంట. ముఖ్యంగా అరటి పండ్లు పెరిగే కొద్దీ సూర్యడి వైపు తిరుగుతాయంట.
అయితే అరటి పండు వంకరగా ఉండటానికి అసలు కారణం ఫోటో ట్రోపిజమని శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ కణంతో అరటి పండ్లలోని కణాలు సూర్యరశ్మి వైపు తిరగడం ప్రారంభిస్తాయని పేర్కొన్నారు. అలా అరటి పండ్లు పైకి పెరిగి, నెమ్మదిగా వంగుతాయని అన్నారు. దీనిని నెగటివ్ జియోట్రోపిజం అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad