నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మీకు సమస్య ఉన్నవారు తప్పకుండా డైట్ ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహార లు తీసుకోకూడదంట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
ఉప్పు: బీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తీసుకోకూడదంట. ఉప్పులో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండెపోటుకు కారణం అవుతుంది. కావున ఉప్పును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
స్వీట్స్: స్వీట్స్ అంటే తినని వారంటూ ఎవరూ ఉండరు. అయితే బీబీ సమస్యతో బాధపడుతున్న వారు సీడ్స్ తినకూడదు. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
వేపుడు ఆహారాలు: బీపీ తో ఉన్నవారు వేపుడు ఆహారాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇవి చెడు కొవ్వు ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
మద్యం, కూల్ డ్రింక్స్: బీపీ ఉన్నవారు మద్యం, కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఇవి అధిక రక్తపోటును పెంచే అవకాశం ఉంటుంది. దీని కారణంగా గుండెపోటు వస్తుంది. వీటికి బదులుగా ఫ్రూట్ జ్యూసులు త్రాగవచ్చు