వర్షాకాలం తాజాదనాన్ని, చల్లదనాన్ని తీసుకురావడమే కాకుండా, అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ సీజన్లోని తేమ కారణంగా కూరగాయలపై బ్యాక్టీరియా, కీటకాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తగిన జాగ్రత్తగా తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆకుకూరలు: వర్షాకాలంలో పాలకూర, మెంతికూర వంటి ఆకు కూరలపై కీటకాలు, బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటిని తినడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, విరేచనాలు వస్తాయి.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ కీటకాలతో నిండి ఉంటుంది. అంతేకాదు ఇది వర్షాకాలంలో త్వరగా కుళ్ళిపోతుంది.దీని తింటే కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్ అవుతుంది.
వంకాయ: వంకాయలు వర్షాకాలంలో త్వరగా చెడిపోతాయి. వీటిలోని తేమ ఫంగస్, కీటకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని తింటే చర్మ అలెర్జీలు వస్తాయి
బెండకాయ: ఓక్రా సహజంగా జిగటగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో దీని జిగట మరింత పెరుగుతుంది. కావున, దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం వస్తుంది.