మనం తరచుగా కూరగాయలు ఫ్రిజ్లో నిలువ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా, సురక్షితంగా ఉంటాయని భావిస్తాం. కానీ, ఆ చల్లదనానికి కూరగాయలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. పైగా వాటిలో రంగు, రుచి, పోషకాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ సమస్య వర్షాకాలం, వేసవి కాలంలో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగాళాదుంపలు: ఫ్రిజ్ లో బంగాళదుంపలను నిల్వ చేయడం ద్వారా స్టార్చ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగానే దాని రుచి తీయగా మారుతుంది. అంతేకాదు, ఇందులో ఉండే అనేక పోషకాలు తొలగిపోతాయి. కావున బంగాళదుంపలను గాలి చొరబడని బుట్ట లేదా గిన్నెలో నిల్వ చేయడం మంచిది.
ఉల్లిపాయలు: ఉల్లిపాయాలను చల్లని, పొడి, గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఒకవేళ వీటిని ఫ్రిజ్ లో ఉంచితే తేమను గ్రహిస్తుంది. దీని కారణంగానే ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోవడం జరుగుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి కూడా తేమను త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి దీన్ని ఫ్రిజ్ లో ఉంచకూడదు. వెల్లుల్లిని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి చాలా రోజులపాటు సురక్షితంగా, రుచికరంగా ఉంటాయి.
టమోటా: టమోటాల రుచి, ఆకృతి కారణంగా ఫ్రిజ్లో నిల్వ చేస్తే చెడిపోవచ్చు. దీనిని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. సరిగ్గా నిలువ చేసిన టమోటాలు రిఫ్రిజిరేటర్ లో ఉంచిన టమోటాల కంటే వారం పాటు తాజాగా ఉంటాయి.
దోసకాయ: సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా కూరగాయగా ఉపయోగిస్తాం. కావున దీనిని పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్ లో మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ చేస్తే మంచిది కాదు. ఇది త్వరగా దాని తాజాదనాన్ని కోల్పోతుంది.