సాధారణంగా చాలా మంది స్మార్ట్ ఫోన్‌ను పదే పదే ఛార్జింగ్ చేస్తుంటారు. మరికొంతమంది ఛార్జింగ్ రెడ్ సింబల్ వచ్చేవరకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఛార్జింగ్ పెడతారు. ఇది చాలా ప్రమాదకరం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు లిథియం- అయాన్ బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేయడం లేదా పదే పదే ఛార్జ్ చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువకు పడిపోకముందు ఛార్జింగ్ చేయాలి. లేదంటే దాని బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది.
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఫుల్‌గా అంటే 100 శాతం ఛార్జింగ్ చేయకండి. 80- 90 శాతం ఛార్జింగ్ వరకు చేరుకోగానే వెంటనే తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ సురక్షితంగా ఉంటుంది.
అంతే కాకుండా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, కాల్స్ మాట్లాడటం వంటివి చేయడం చాలా ప్రమాదకరం. బ్యాటరీ దెబ్బతినడమే కాకుండా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
నకిలీ లేదా లోకల్ ఛార్జర్లను ఉపయోగించకూడదు. ఇంకా చల్లని లేదా బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.