ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట నిద్రపోవడం చాలా ముఖ్యం. చాలామందికి ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఇబ్బంది పడుతుంటారు. నిద్ర రాక రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అయినా నిద్ర మాత్రం రాదు. మీకు కూడా నిద్రలేమి సమస్య ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వేడి పాలు తాగితే ట్రిప్టోఫెన్, మెలటోనిన్ సహజంగా పెరుగుతాయి, కార్టిసోల్ తగ్గుతుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది.