నేటి బిజీ లైఫ్, జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించడానికి కొందరు వాకింగ్ చేస్తే, మరికొందరు జిమ్ కు వెళ్తుంటారు. అయినా ఆశించినంత ఫలితం లభించదు. ఊబకాయం తగ్గాలంటే కేవలం వర్క్ అవుట్స్ చేయడం మాత్రమే కాదు.. తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ వహించాలి. అయితే, మన డైట్ లో కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని సులభంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ పండ్లు శరీర కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడుతాయి.
ఆపిల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పదే పదే తినే అలవాటును నివారిస్తుంది.
ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతాయి.
బెర్రీలలో తక్కువ మొత్తంలో సహజ చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. అందువల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆకలిగా అనిపించదు.
పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కడుపు మంటను తగ్గిస్తుంది. దీని తినడం ద్వారా కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో బరువు సులభంగా తగ్గొచ్చు.
ద్రాక్షపండు శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని కారణంగానే శరీరం ఎక్కువ కార్బోహైడ్రేట్లను కరిగిస్తుంది. తద్వారా బరువు కూడా సులభంగా తగ్గుతాం.