పసుపు. దీన్ని గోల్డెన్ స్పైస్ అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో పసుపుకి ఉన్న ప్రాధాన్యతో ఎంతో గొప్పది. అంతే కాదు.పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లోనూ పసుపు తప్పనిసరిగా వాడతారు.
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న పసుపుతో కొన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా కిడ్నీల పని తీరుని మెరుగుపరచడంలోనూ ఇది తోడ్పడుతుంది.
ఇన్ని ప్రయోజనాలున్న పసుపుతో ఓ డేంజర్ కూడా ఉందని మీకు తెలుసా. నిజమే. ఏ కిడ్నీల ఆరోగ్యాన్ని అయితే కాపాడుతుందో అదే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది పసుపు
పసుపులో కర్ క్యుమిన్ ఉంటుంది. ఇదే ఆరోగ్యాన్ని అందిస్తుంది. కానీ..ఇదే అనారోగ్యాలనూ తీసుకొస్తుంది. పసుపులో ఉండే కర్ క్యుమిన్ వల్ల యూరిన్ లో ఆక్సలేట్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి.
పసుపు వల్ల రక్తం పల్చ బడుతుంది. ఇప్పటికే బ్లీడింగ్ సహా మరి కొన్ని ఇబ్బందులు ఉన్న వారు పసుపు తీసుకుంటే అవస్థలు పడాల్సి వస్తుంది.
ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువ మోతాదు తీసుకుంటారు. అయితే..ఇకపై ఈ మోతాదుని తగ్గించుకోవడం మంచిది. లేదంటే ఉన్న సమస్యలు పోకపోగా కొత్తవి వస్తాయి.