ఫిట్ గా ఉండాలంటే శరీరానికి సరిపడా నీరు త్రాగాలి. రోజుకు కనీసం 3- 5 లీటర్ల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాదు రోజంతా చురుగ్గా ఉంటాం.
ఈ వయసులో తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. డైట్ లో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లు , గింజలు తీసుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. కావున ఈ సమస్యలను నివారించేందుకు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. లేదా ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయాలి. దీనివల్ల శరీరం చురుగ్గా మారుతుంది.
ఆరోగ్యం పూర్తిగా నిద్రపై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు 8 గంటలపాటు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు రోజంతా హుషారుగా ఉంటాం.
30 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. స్మోకింగ్, అతిగా ఆల్కహాల్ తాగడం వంటి వాటిని మానుకోవాలి. దీంతో గుండెతో పాటు కాలేయం, కిడ్నీ ఆరోగ్యంగా ఉంటాయి.