Hair GrowthHabits: రోజును ఆరోగ్యంగా ప్రారంభిస్తే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నియమం కురుల ఆరోగ్యానికి కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో మనం పాటించే కొన్ని అలవాట్లు మరియు ఆహార నియమాలు మన జట్టు ఒత్తుకు ఎంతగానో సాయపడుతాయి మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లు, మిటమిన్లు, మినరల్స్ ఉంటే సమతుల ఆహారం తీసుకోవాలి. మనలో చాలా మందికి నిద్ర లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వాటికి ముందు గ్లాసు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లలో చర్మం తేమగా మారి జుట్టు ఎదుగుదలను ప్రేరేపిస్తుందంటున్నారు.ఆకుకూరలు, గుడ్లు, చేపలు, నట్స్, విత్తనాలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా మార్నింగ్ మనం తీసుకొనే అల్పాహారం ఆకలి తీర్చడానికే కాకుండా.. జుట్టు ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందంటున్నారు నిపుణులు.గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆలివ్ నూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్ చేసుకోవాలి. అంతే కాకుండా ఎండ వల్ల చర్మం కందిపోకుండా సన్‌స్క్రీన్ లోషన్ ఎలాగైతే రాసుకుంటామో.. అలాగే జుట్టు ఆరోగ్యం పాడవకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ తప్పక ఉపయోగించాలి. ఉల్లిపాయ రసాన్ని తలకి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.