ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడంలో ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ తో పాటు పొటాషియం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక పొటాషియం లోపం అధిక రక్తపోటు, కండరాల బలహీనత, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటి పనితీరు సరిగా ఉండాలంటే పొటాషియం అవసరం. ఈ క్రమంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కొబ్బరి నీరు పొటాషియం సహజ మూలం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. దీన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ కూడా నివారిస్తుంది.
పాలకూర, ఇతర ఆకుకూరలు పొటాషియంలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఇతర పోషక లోపాలను కూడా తీర్చవచ్చు.
చిలగడదుంపలో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.