మన ఆరోగ్యం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. అయితే, వయసు పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలో కనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, బోన్ డెన్సిటీ తగ్గుదల, చిర్మంపై ముడతలు, పీరియడ్స్ సమస్యలు ఫెర్టిలిటీ మార్పులు వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ దశలో ఆడవాళ్లు తీసుకునే ఆహారమే మరి భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కావున 30 ఏళ్లు దాటిన స్త్రీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పండ్లు: పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం, జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ద్రాక్ష, బొప్పాయి, నారింజ, సీతాఫలం వంటి పండ్లు తీసుకోవాలి. వీటిలో ఉండేవి అంటే ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. అంతేకాదు, విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
పప్పులు, గింజలు: పప్పులు, గింజలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి వంటివి సమృద్ధిగా ఉంటాయి. దీని ఫలితంగా ఇవి శరీరానికి బలం చేకూరుస్తాయి. అంతేకాదు, వీటిలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమిన్ కే, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. తద్వారా ఎముకలు ను బలోపేతం చేస్తాయి. తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలను డైట్ లో చేర్చుకోవాలి.