మన ఆరోగ్యం మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటాం. అయితే, కొన్నిరకాల పండ్లు, కూరగాయలు ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల అసిడిటీ సమస్య తీవ్రం అవుతుంది.
కాఫీ/టీ ఖాళీ కడుపుతో తీసుకుంటే పేగులకు ఇర్రిటేషన్ కలుగుతుంది.
ఖాళీ కడుపుతో అనాస పండు కూడా తినకూడదు. ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కడుపు లోపల దురదరించే లక్షణాలు, వాంతులు కలగవచ్చు.
టమోటాలో ఉండే టానిక్ యాసిడ్ ఖాళీ కడుపున పేగుల గోడలపై ప్రభావం చూపిస్తుంది. ఇది హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లెక్స్ , అజీర్తి సమస్యలు కలిగిస్తుంది.
ఖాళీ కడుపుతో షుగర్ ఫుడ్స్ కూడా తినడం మానుకోవాలి. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒకసారిగా పెరిగే అవకాశం ఉంటుంది.