ఈరోజుల్లో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఎముకల బలహీనత కూడా ఒకటి. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణాలు. అయితే, తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మిల్క్ ప్రొడక్ట్స్: పాల ఉత్పత్తులు ప్రోటీన్ పవర్ హౌస్ లుగా పరిగణిస్తారు. వీటిలో ఎముకలకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
కొవ్వు చేపలు: సాల్మన్, సార్డిన్స్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. ఇవి కీళ్లలో మంటను తగ్గించి, ఆరోగ్యంగా ఉంచుతాయి
ఆకుకూరలు: ఆకుకూరల్లో కాల్షియం, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వాటిని బలోపేతం చేస్తాయి.
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయ, ఆమ్లా వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతాయి. ఈ పండ్లు ఎముకలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.