ఆరోగ్యాంగా ఉండాలంటే డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దేని ప్రత్యేకత దానిదే. చలికాలంలో అనేక రుచికరమైన, పోషకాలు నిండిన పండ్లు లభిస్తాయి. అయితే, వీటిలో కొన్ని ఆరోగ్యానికి మేలు చేసే బదులుగా హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణ సమస్యలు లేదా జలుబు వంటి ఇబ్బందులను కలిగిస్తాయి. కావున శీతాకాలంలో ఏ పండ్లు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
ద్రాక్షను శీతాకాలంలో అధికంగా తినడం మానుకోవాలి. దీని చల్లని స్వభావం కఫాన్ని పెంచి గొంతు నొప్పి, జలుబును మరింత ఎక్కువ చేస్తుంది.
కొబ్బరి నీరు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుంది. కావున ఇది శరీరంలో కఫాన్ని పెంచుతుంది. జలుబు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే ఛాతీ పట్టేయడం వంటి సమస్యలు పెరగవచ్చు.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే దోసకాయను, చలికాలంలో తినకూడదు. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చల్లదనం పెంచి దగ్గు, జలుబు వంటి సమస్యలకు దారితీస్తుంది.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే దోసకాయను, చలికాలంలో తినకూడదు. ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చల్లదనం పెంచి దగ్గు, జలుబు వంటి సమస్యలకు దారితీస్తుంది.
అవకాడో ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ ఇందులో ఉండే హిస్టామిన్ కంటెంట్ కొంతమందిలో అలెర్జీ, దగ్గు సమస్యలను పెంచవచ్చు.