8th Pay Commission Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. మరో 6 నెలల్లో 8వ వేతన సంఘం అమలులోకి తీసుకురానుంది. దీంతో ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుంది.
కమిషన్ ఏర్పాటు చేసిన అనంతరం కనీసం 8 నెలల వరకు అధ్యయనం జరిగే అవకాశం ఉంటుంది. అనంతరం కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి చేరతాయి. దీనిపై సాధ్యసాధ్యాలు పరిశీలించి అమల్లోకి తీసుకొచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 2026 ద్వితీయార్థంలో 8వ వేతన సంఘం ప్రకారం వేతనాలు పెరగనున్నాయి.
గతంలో అమలు చేసిన ఏడో వేతన సంఘంలో ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ స్థాయిలో జీతాలు, పెన్షన్లు పెరిగాయి. ఇప్పుడు 10 ఏళ్లు దాటడం ఆర్థికంగా ఖర్చులు పెరగడంతో 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ 2.83శాతంగా ఉండాలని పట్టుపడుతున్నారు. ఏడో వేతన సంఘంలో 2.57శాతంగా ఫిట్మెంట్ ఇచ్చారు.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫిట్మెంట్ 1.92 వరకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం కనీస వేతనం రూ. 18000 నుంచి రూ. 36000కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Disclaimer : ఈ వార్త కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. 8వ వేతనం సంఘం వార్తల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.