కొన్ని ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు ఎంతో సహాయపడతాయి. వాటిలో పచ్చి బొప్పాయి ఒకటి. పచ్చి బొప్పాయి మాత్రం ప్రత్యేకంగా షుగర్ ఉన్నవారికి మరింత ఉపయుక్తంగా మారుతుంది.
పచ్చి బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. ఈ GI స్కోర్ అనేది ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో సూచిస్తుంది. GI తక్కువగా ఉన్న పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి.
మధుమేహం ఉన్నవారికి ఇది ఒక గొప్ప ప్రయోజనం. పచ్చి బొప్పాయి తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి.
అంతేకాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు కొనసాగటంతో ఆకలిగా అనిపించదు. ఇది బరువు నియంత్రణకు దోహదం చేయడం వల్ల మధుమేహంపై అదుపు పెరుగుతుంది.