Saturday, November 15, 2025
Homeగ్యాలరీHair Fall In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా?.. అయితే, ఈ టిప్స్‌తో మీ సమస్యకు...

Hair Fall In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా?.. అయితే, ఈ టిప్స్‌తో మీ సమస్యకు చెక్‌ పెట్టండి

Hair Fall In Winter Follow These Tips: చలికాలం రావడంతోనే మన చర్మానికి, ముఖ్యంగా జుట్టుకు సవాలు విసురుతుంది. చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల జుట్టు పొడిబారి, చిట్లి, పెళుసుగా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తీవ్రమవుతుంది. ఇలాంటి సందర్భంలో జుట్టుకు ట్రీట్ మెంట్ అవసరం లేదు. తలస్నానం చేసినప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

చలిలో వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం అత్యంత సౌకర్యంగా ఉంటుంది. కానీ మీ జుట్టు ఆరోగ్యానికి ఇది ప్రధాన శత్రువువని గుర్తించండి. ఎందుకంటే, వేడి నీళ్లు మీ తల నుంచి సహజ నూనెల, తేమను పూర్తిగా తొలగిస్తాయి. ఇది తొలగిపోవడం వల్ల తల బాగా పొడిబారి, దురదకు గురై, చుండ్రు సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా, జుట్టు లోపల ఉండే తేమను కోల్పోయేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి రాలిపోతాయి. అందుకే తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
జుట్టు రాలకుండా ఉండాలంటే పొడి వాతావరణం ఉన్న చలికాలంలో జుట్టును తరచుగా షాంపూ చేయకూడదు. షాంపూలో ఉండే రసాయనాలు జుట్టులోని సహజ నూనెలను శుభ్రం చేస్తాయి. చలికాలంలో ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, షాంపూ చేసే ఫ్రీక్వెన్సీని తగ్గించండి. ప్రతిసారీ షాంపూతో తల స్నానం చేసిన తర్వాత కచ్చితంగా నాణ్యత గల కండిషనర్ వాడండి. కండిషనర్ జుట్టు పైన రక్షణ పొరను ఏర్పరుస్తుంది. తేమ బయటకు పోకుండా కాపాడుతుంది.
తడి జుట్టు అత్యంత బలహీనంగా ఉంటుంది. అందుకే, చలికాలంలో తల స్నానం చేయడం వల్ల జుట్టు సులభంగా రాలిపోతుంది. అందుకే, స్నానం తర్వాత మామూలు టవల్‌తో జుట్టును గట్టిగా రుద్దడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టవల్‌తో రుద్దడం వల్ల ఘర్షణ ఏర్పడి జుట్టు చిట్లి, రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు తుడుచుకోవడానికి సాఫ్ట్ మైక్రోఫైబర్ టవల్‌ను లేదా పాత కాటన్ టీ-షర్ట్‌ను ఉపయోగించండి. జుట్టులోని చిక్కులను తొలగించడానికి వెడల్పాటి పళ్ల దువ్వెన మాత్రమే వాడండి.
స్నానం ఎక్కువ సమయం చేయడం కూడా జుట్టు రాలడానికి పరోక్షంగా కారణమవుతుంది. జుట్టును ఎక్కువ సేపు నీళ్లలో ఉంచడం వల్ల అది ఎక్కువ నీటిని పీల్చుకుని ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బిన జుట్టు బలహీనంగా, సాగే గుణంతో ఉంటుంది. ఈ స్థితిలో దాన్ని తుడుచుకున్నా, దువ్వినా సులభంగా రాలిపోతుంది. అందుకే, ఎక్కువ సేపు కాకండా కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే తల స్నానం చేయండి. త్వరగా శుభ్రం చేసుకుని జుట్టును ఆరబెట్టుకోవడం ఉత్తమం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad