Saturday, November 15, 2025
Homeగ్యాలరీHair Fall: అమ్మాయిలూ.. మీ జుట్టు రాలుతోందా?.. పొడవాటి జుట్టుకోసం ఈ ఆహారాలు తీసుకోండి

Hair Fall: అమ్మాయిలూ.. మీ జుట్టు రాలుతోందా?.. పొడవాటి జుట్టుకోసం ఈ ఆహారాలు తీసుకోండి

Hair Loss Food Tips: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది చాలామందికి ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి వంటివి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే, జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

- Advertisement -
జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే రోజూ ఏడు బాదం పప్పులు, రెండు వాల్‌నట్స్‌ తినాలి.
టీస్పూన్‌ చొప్పున సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు తీసుకోవడం కూడా లభిస్తుంది.
పరగడుపునే టీస్పూన్‌ కొబ్బరి నూనె తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. దీనిలోని ప్రొటీన్‌ జుట్టును ఒత్తుగా చేస్తుంది.
బి12 విటమిన్‌ లోపం కొత్త జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. ఈ లోపాన్ని భర్తీ చేయాలంటే ఈ విటమిన్‌ తీసుకోవాలి.
డి’ విటమిన్‌ లోపం వల్ల అలొపేసియా సమస్య తలెత్తుతుంది. కాబట్టి తగిన మోతాదులో డి విటమిన్‌ తీసుకోవాలి.
విటమిన్‌ సప్లిమెంట్ల కన్నా అవి లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad