Happy Janmashtami 2025: హిందూ పండుగలో కృష్ణాష్టమి ఒకటి. ఈ పండుగను జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజును శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణుడు జన్మించిన రోజు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున, రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో మధురలో దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించాడు.
- Advertisement -

ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు రాత్రి శ్రీ కృష్ణుడు జన్మించిన సమయం వరకు పూజలు నిర్వహిస్తారు. భారతీయ పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. ఆయన బాల్యాన్ని ప్రతిబింబిస్తూ, ఉట్టికొట్టడం వంటి సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కీర్తనలు, భజనలు చేస్తారు.


