Saturday, November 15, 2025
Homeగ్యాలరీHealth benefits: సీతాఫలమే కాదు.. ఆకులతో సైతం అనేక ఔషధగుణాలు.. తింటే ఆ రోగాలన్నీ...

Health benefits: సీతాఫలమే కాదు.. ఆకులతో సైతం అనేక ఔషధగుణాలు.. తింటే ఆ రోగాలన్నీ పరార్!

Custard apple leaves: సీజనల్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తుంది. అయితే సీతాఫలాలే కాదు.. దాని ఆకులతో సైతం అనేక ఔషధగుణాలు ఉన్నాయంట. అయితే ఆ ఆకుల వలనా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం!

సీతాఫలం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
సీతాఫలం ఆకులు డయాబెటీస్ రోగులకు మంచి ఔషధంగా పని చేస్తాయి. రోజూ సీతాఫలం నీటిని మరగ బెట్టి తాగడం వలన షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
సీతాఫలం ఆకులను నీటిలో మరగ బెట్టి ఆ నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగడం వలన కడుపు సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలగుతుంది.
సీతాఫలం ఆకులతో టీకాచుకొని తాగడంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే.. ఇందులో లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సీతాఫలం ఆకులు దంత సమస్యలకు మంచి దివ్యౌషధంగా పని చేస్తాయంట. ఇవి దంతాల బ్యాక్టీరియాను తగ్గించి, నోటి శుభ్రతను కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు సూచించారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad