మార్కెట్లో రకరకాల కూరగాయలు లభిస్తాయి. . మనకు అందుబాటులో ఉండే రెగ్యులర్ కూరగాయలనే వండుకుని తింటుంటాం. కొన్ని సందర్భాల్లో మనం మార్కెట్లో చిత్రాతిచిత్రమైన కూరగాయలను కూడా చూస్తుంటాం. వాటిని చూస్తే కూరగాయలు అంటారా అని సందేహం వస్తుంది. అలాంటి వాటిలో ఫిడిల్హెడ్ ఫెర్న్ ఒకటి. దీని లింగుడ, లుంగుడు, కాస్రోడ్ అని కూడా పిలుస్తారు. దీనిలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లతో సహా అనేక పోషకాలు ఉంటాయి. దీని తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
ఫిడిల్హెడ్ ఫెర్న్లు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మెదడు శక్తిని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
వీటిలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీని విటమిన్ సి రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఫిడిల్హెడ్ ఫెర్న్లు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను గణనీయంగా తగ్గిస్తాయి.
ఈ లింగడ్ కూరగాయ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తహీనత కూడా నివారిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది.