Health Benefits of Beetroot juice: బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. బీట్‌రూట్ జ్యూస్‌ను వరుసగా 15 రోజుల పాటు తాగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. గుండె, మెదడు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ B6, విటమిన్ సీ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ 15 రోజులు తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. బీట్‌రూట్‌లను చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూసర్ లేదా బ్లెండర్ జార్‌లో వేసి రసం తీయాలి. రసం చిక్కగా అనిపిస్తే.. అవసరానికి తగినంత నీరు కలపవచ్చు. రుచి కోసం నిమ్మరసం, కొద్దిగా పంచదార కూడా కలపాలి.బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన చర్మానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది.బీట్‌రూట్ రసం త్రాగడం వల్ల కాలేయ వాపు తగ్గుతుంది. అంతేకాకుండా, అలసట ఉన్నవారికి బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఎక్కువ అలసట లేదా శక్తి లోపంతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి విటమిన్లు చర్మాన్ని తేజోమంతంగా చేస్తాయి. బీట్‌రూట్ రసాన్ని 15 రోజులు క్రమం తప్పకుండా తాగితే.. చర్మం ప్రకాశవంతంగా, మెరిసేలా మారుతుంది. బీట్‌రూట్ చర్మానికి సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కోరుకునేవారికి బీట్‌రూట్ బెస్ట్. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.బీట్‌రూట్ రసం గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బీట్‌రూట్ జ్యూస్‌ను దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.