లవంగాలు ఒక మసాలా దినుసే అయినా, మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. లవంగాలు పంటి నొప్పి నుంచి ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే దీని ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత 2 లవంగాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం.
తిన్న తర్వాత చాలామందికి ఆహారం అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వాటికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. నిపుణుల ప్రకారం..తిన్న తర్వాత రెండు లవంగాలను నమిలితే జీర్ణ ఎంజైమ్‌ల స్రావం పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
రాత్రిపూట తిన్న చేసిన తర్వాత లవంగాలను నమిలితే పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాల వల్ల ఏర్పడే బ్యాక్టీరియా పెరగడం తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతాయి.
డయాబెటీస్ ఉన్నవారు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతుంటాయి. అయితే, లవంగాలను గనుక నమిలితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి, లవంగాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మీ మెటబాలిజాన్ని పెంచుతాయి. ఫలితంగా శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.