ఆపిల్, బీట్రూట్, క్యారెట్లతో కలిపి చేసే ఏబీసీ జ్యూస్. ఈ జ్యూస్ టేస్టీగా ఉండటమే కాకుండా, దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఆపిల్, బీట్రూట్ల నుంచి విటమిన్ సి, క్యారెట్ల నుంచి బీటా-కెరోటిన్తో రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది.
జ్యూస్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
జ్యూస్లో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, Cలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఏబీసీ జ్యూస్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.