ఏబీసి జ్యూస్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలాన్ని ఉంటాయి. ఏబీసీ జ్యూస్ ను ఆపిల్, బీట్ రూట్, క్యారెట్ తో తయారుచేస్తారు. తరచుగా దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. ఇప్పుడు ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం.
ఆపిల్, బీట్ రూట్ ల నుంచి విటమిన్ సి, క్యారెట్ల నుంచి బీటా కేరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగితే కడుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది.
ఏబీసీ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మాని మొటిమలు, ముడతల నుంచి రక్షించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
రోజు ఈ జ్యూస్ తాగితే లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి సులభంగా పంపిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ జ్యూస్ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు ఎక్కువ సమయం నిండిన భావన కలిగిస్తుంది. ఇందులో కెరరీలు తక్కువగా ఉంటాయి. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు