తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దరిచేరవు!
తులసిలో టీ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
ఈ టీ తాగడం వల్ల బాడీలో టాక్సిన్లు సులభంగా బయటకుపోతాయి. బాడీ క్లీన్ అవుతుంది.
తులసి టీ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండ దీని తాగితే ముడతలు తగ్గి, మెరిసే చర్మం సొంతం అవుతుంది.
తులసిలో టీలో ఉండే అంశాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది హార్మోన్లు సమతుల్యంగా ఉంచుతుంది.
తులసి టీ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.