ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి ఒకటి. రాత్రి సమయంలో దీని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో లో ఉండే విటమిన్ ఏ, సీ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడం నుంచి మెరుగైన జీర్ణక్రియ వరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రిపూట బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బొప్పాయిలో పొటాషియం ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఫలితంగా ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీనిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. దీనిలోని ఫైబర్ – నీటి శాతం ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది.
దీనిలో ఉండే విటమిన్లు ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ముడతలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.