రోజుకొక్క యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. నిజానికి యాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
యాపిల్ లో కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియం సహా ఎన్నో పోషకాహారాలు ఉంటాయి.
ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేసి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పోషకాలు దండిగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్ మంచి ఎంపిక.
ముఖ్యంగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తింటే నెల రోజుల్లోనే మీ ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఇందు కోసం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినాలి. యాపిల్‌లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది.
యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది.
సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను సైతం నివారిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో యాపిల్ ఎంతో కీలకం.