ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తుంది. కరివేపాకుని పచ్చిగా తింటే ఈ సమస్య దూరమవుతుంది. అయితే, ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది.
కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.
ఖాళీ కడుపుతో కరివేపాకుని తింటే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలిగిపోతాయి. మూత్ర పిండాల పనితీరు మెరుగవుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది.
కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది.