సీజనల్ ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో “అమృతఫలం”గా పేరుగాంచిన సీతాఫలం ఇప్పుడు మార్కెట్లలో కనిపించటం మొదలైంది. దీని రుచి కారణంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తినడానికి ఇష్టపడుతారు. సీతాఫలంలో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
సీతాఫలం లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి,
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విటమిన్లు శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా వంటి హానికరమైన కారకాలు నుంచి రక్షిస్తాయి.
ఈ పండు ఫైబర్ మూలం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమంగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఫైబర్ మోతాదుతో పాటు, సీతాఫలం తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిపోతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సీతాఫలంలో ఉండే విటమిన్ ఎ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి, ముడతలు రాకుండా చేస్తుంది.