వివిధ వంటకాలలో వాడే ఆహార పదార్థాలలో పచ్చి మిర్చి ఒకటి. ఇది వంటకాలకు కారం, రుచిని అందించడమే కాకూండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎండు మిర్చితో పోలిస్తే పచ్చి మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఉండే అనేక పోషకాలు బరువు తగ్గడం నుండి గుండె ఆరోగ్యం వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ క్రమంలోవీటిని తినడం వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పచ్చి మిరపకాయలలో కాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి, కొవ్వును కతిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.
దీని సహజ నొప్పి నివారిణిగా పరిగణిస్తారు. పచ్చి మిరపకాయలలో ఉండే లభించే కాప్సైసిన్ అనే సమ్మేళనం నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి నొప్పిని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కలిగే గుండెల్లో మంట నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పచ్చి మిరపకాయలు తినడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిని తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది రక్తపోటును సైతం నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
పచ్చి మిరపకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మిరపకాయలలోని రసాయన క్యాప్సైసిన్ ఇన్సులిన్ స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
పచ్చి మిరపకాయలలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.