పడుకునే ముందు మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి, మెరిసే చర్మాన్ని కోరుకునేవారికి ఇది అద్భుతమైన ఎంపిక.
రాత్రిపూట బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం ఒక తెలివైన ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
బొప్పాయిలో విటమిన్లు A, C, E సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ విటమిన్లు చర్మాన్ని లోపలి నుండి మెరుస్తూ ఉంచడంలో సహాయపడతాయి.
బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.