ఈరోజుల్లో చాలామంది తమ ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం గణనీయంగా పెరిగింది. వాటిలో ముఖ్యంగా రాగులు. రాగుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నిషియం, పాలిఫినాల్స్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. రాగులతో రాగి ముద్ద, జావ, రొట్టెలాంటి పదార్థాలను తయారు చేయవచ్చు. ఇప్పుడు రాగుల వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
రాగులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఉండే లెసితిన్, మిథియోనైన్ వంటి సమ్మేళనాలు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు, ఇందులో ఉండే మెగ్నిషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది.
వీటిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఉత్పన్నం అయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. రాగులు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. దీని వినియోగం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
షుగర్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంటాయి.