ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అంతేకాదు రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండుద్రాక్ష ఎముకలను బలోపేతం చేస్తుంది.
జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి కిస్మిస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆరని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రై ఫ్రూట్ ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కాబట్టి పదేపదే తినే అలవాటును నివారించవచ్చు.
రోగనిరోధక శక్తి: పుచ్చకాయ గింజలలో జింక్ అధికంగా ఉంటుంది. ఫలితంగా విడిని తీసుకుంటే ఒక నిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కిస్మిస్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు, చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.