చింతపండును దాదాపు అన్ని వంటకాలలో ఉపయోగిస్తాం. కానీ, వాటి గింజలను పడేస్తుంటాం. కానీ, మీకు చింత గింజలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని! చింతపండులోని ఉండే ఔషధ గుణాలు గింజలలోనూ ఉంటాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు చర్మ సమస్యల నుంచి గుండె ఆరోగ్యం వరకు సహాయపడుతాయి. ఇప్పుడు చింత గింజలు ఎవరు తినకూడదు?ఎలా తినాలి? వీటి ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
చింతపండు గింజలను డయాబెటిస్ మందులు తీసుకునే వారు, గర్భిణీ స్త్రీలు లేదా పిల్లలు దీనిని తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించాలి. వీటిని ఎలా తీసుకోవాలంటే? ఎండబెట్టిన గింజల పొడిని 1/2 టీస్పూన్ వేడి నీటి లేదా తేనెతో జోడించి తీసుకోవచ్చు. కావల్సితే నమిలి కూడా తినవచ్చు!
ఈ గింజలలో ఉండే హైఅలురోనిక్ ఆమ్లం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండిన గింజల పొడిని పేస్ట్ రూపంలో ముఖానికి అప్లై చేయవచ్చు. దీంతో మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.
చింతపండు గింజలలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవిఅధిక రక్తపోటును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండ వీటిని తింటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.