ఓట్స్ అనేది ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ నుఆహారంలో వివిధ మార్గాల్లో చేర్చవచ్చు. క్రమం తప్పకుండ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఓట్స్ లోని బీటా-గ్లూకాన్ పేగుల్లో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. కావున వీటిని క్రమం తప్పకుండ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ప్రతిరోజూ ఉదయం ఒక గిన్నె ఓట్స్ తినడం ద్వారా వీటిలోని బీటా-గ్లూకాన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
ఓట్స్‌లోని ఉండే యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని అందిస్తాయి.
ఓట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి బెస్ట్ ఛాయిస్. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
వీటిని తినడం కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.