Health Benefits of Papaya Seeds: బొప్పాయి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఫ్రూట్. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు సహాయపడతాయి.
బొప్పాయిలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీర పనితీరును సరైన రీతిను మెరుగుపరుస్తుందతి. అయితే, బొప్పాయి మాదిరిగానే దానిలోని విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాధారణంగా మనం బొప్పాయి తిన్న తర్వాత విత్తనాలను పారేస్తాము. బొప్పాయి గింజల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలంటాయి. అవేంటో తెలుసుకుందాం.మీరు మాంసాహారం తినకపోతే ఈ విత్తనాలు మీ శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలను తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బొప్పాయి విత్తనాల్లో ఫైబర్, పపైన్, కార్పైన్ వంటి జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.ఇక, బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది.బొప్పాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. బొప్పాయి గింజలు తీసుకుంటే ఊబకాయ సమస్య కూడా తగ్గుతుంది.బొప్పాయి గింజల నీటిని పరగడపున తాగితే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది మీ జీర్ణశక్తి, జీవక్రియకి కూడా మేలు చేస్తుంది. మొత్తం బరువుని కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది.