దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరఎం లేదు. అయితే దాని తొక్కలతో చేసిన టీ కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ తొక్కలలో ఉండే ఔషధ గుణాలు చర్మ సమస్యల నుంచి గుండె ఆరోగ్యం వరకు మేలు చేస్తాయి. ముఖ్యంగా కడుపు ఆరోగ్యాని మెరుగుపరుస్తాయి. దానిమ్మ తొక్కల టీ తాగడం వల్ల కలిగే లాభాల చూద్దాం.
దానిమ్మ తొక్కలటీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
ఇది రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. తొక్కలో ఉండే టానిన్, పాలీఫెనాల్స్ వంటి అంశాలు వాపును తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి సహాయపడతాయి.
దానిమ్మ తొక్కలటీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తొక్కలలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. సాధారణ రక్తపోటుకు సహాయపడుతుంది.
ఇది సహజ మెరుపును అందిస్తుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దద్దుర్లు, మొటిమలు, అలెర్జీలను తగ్గిస్తాయి.
ఇందులో ఉండే అంశాలు జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.