మన ఆరోగ్యానికి అపారమైన లాభాలను అందించే ఆహార పదార్థాలలో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఐరన్, ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తాయి. శరీరంలోని క్యాన్సర్ కణాలను సైతం తొలగిస్తామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
దీనిలో అధిక మొత్తంలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
ఉదయాన్నే గుమ్మడికాయ గింజల నీరు తాగితే, ఇందులోని అంశాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గుమ్మడి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి డయాబెటిక్ రోగులకు వరం.
ఈ గింజలు తీసుకుంటే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. రాత్రిపూట రెండు చెంచాల గుమ్మడికాయ గింజలు తింటే హాయిగా నిద్ర పడుతుంది.