రాగి పిండి ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఆహారంలో రాగి రోటీలు, రాగి లడ్డూలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా రాగి లడ్డూలు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రాగి లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. పిల్లలు, వృద్ధులు ప్రతిరోజు రాగి లడ్డూలు తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి శక్తిని అందిస్తుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవారు రాగి లడ్డూలను డైట్లో ఉండేలా చూసుకోవాలి.
రాగి లడ్డూలలో ఉండే ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి. దీని ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఇందులో ఫైబర్ పొట్టను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ బరువును నియంత్రణలో ఉంచుతుంది.
ఇందులో ఇదే ఫైబర్, విటమిన్ B3 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.