సబ్జా గింజలు చూడటానికి చిన్నగా కనిపించిన, వాటి ఆరోగ్య లాభాలు అనేకం! వీటిలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు రోగనిరోధక శక్తిని నుంచి బరువు నియంత్రణకు సహాయపడుతాయి. అయితే, వీటిని సరైన పద్దతిలో తీసుకుంటేనే వాటి ఆరోగ్య లాభాలు పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సబ్జా గింజల్లో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి సబ్జా గింజలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.
సబ్జా గింజలు తినడానికి సరైన మార్గం: వీటిని తినడానికి కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. పొడి విత్తనాలను నేరుగా తినడం వల్ల కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.