ఆరోగ్యాంగా ఉండాలంటే మన డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేలా చేసుకోవాలి. వీటిలో శరీరానికి కావలసిన అనేక పోషకాల ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు. అయితే ఎండు జీడిపప్పు కంటే నానబెట్టిన జీడిపప్పు మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిలో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ శారీరక ఆరోగ్యాన్ని కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.
నానబెట్టిన జీడిపప్పులను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తక్కువ సమయంలోనే చర్మ లో మార్పు గమనించవచ్చు.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి నానబెట్టిన జీడిపప్పు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, బరువు త్వరగా తగ్గడానికి సహాయపడుతాయి.
నానబెట్టిన జీడిపప్పు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.