మనం పుచ్చకాయను తినేటప్పుడు దాన్ని గింజలను పడేస్తుంటాం. కానీ ఆ చిన్న గింజలలో అపరమైన పోషక విలువలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అవును నిజమే పుచ్చకాయ గింజలలో అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ క్రమంలో పుచ్చుగా గింజలు తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం: పుచ్చకాయ గింజలలో మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి: పుచ్చకాయ గింజలలో జింక్ అధికంగా ఉంటుంది. ఫలితంగా విడిని తీసుకుంటే ఒక నిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
చర్మం, జుట్టు:ఇందులో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి చర్మానికి ఎంతో మంచిది. ఇవి చర్మాని తేమగా ఉంచి ముడతలు రాకుండా చేస్తాయి. పుచ్చకాయ గింజలలో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు, జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి సహాయపడుతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని పలు అధ్యయానాలు సూచిస్తున్నాయి. వీటిలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.