Saturday, November 15, 2025
Homeగ్యాలరీBenefits of Fish: చేపలతో ఇన్ని ప్రయోజనాలా?.. తెలిస్తే అస్సలు వదలరు..!

Benefits of Fish: చేపలతో ఇన్ని ప్రయోజనాలా?.. తెలిస్తే అస్సలు వదలరు..!

Health Benfits of Fish: మాంసాహారంలో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. మటన్‌, చికెన్‌ను ఇష్టపడని వారు సైతం సీఫుడ్‌ను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే, దీనిలోని ప్రయోజనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మరి, చేపలతో ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం.

వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక విట‌మిన్ల‌తోపాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క‌నుక చేప‌లను త‌ర‌చూ తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వచ్చు.
చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా స‌ముద్ర‌పు లేదా మంచినీటి చేప‌ల్లో ఇవి ఇంకా ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించేందుకు స‌హాయం చేస్తాయి.
ర‌క్తంలో అధికంగా ఉండే ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. దీంతో గుండె జ‌బ్బులు, గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. చేప‌ల్లో ఉండే డీహెచ్ఏ మెద‌డు, కంటి రెటీనా క‌ణాల‌ను ర‌క్షిస్తుంది. మెద‌డు ఎదుగుద‌ల‌కు స‌హాయం చేస్తుంది.
దీని వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డుతున్న‌ప్ప‌టికీ మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. వృద్ధాప్యంలో వ‌చ్చే అల్జీమ‌ర్స్ రాకుండా చూసుకోవ‌చ్చు.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల ఆర్థ‌రైటిస్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. ఆటోఇమ్యూన్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.
చేప‌లలో విట‌మిన్ డి మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భిస్తుంది. సాధార‌ణంగా మ‌న‌కు విట‌మిన్ డి సూర్య‌ర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. కానీ విట‌మిన్ డి లోపం ఉన్న‌వారు చేప‌ల‌ను తింటుంటే ఆ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad