Saturday, November 15, 2025
Homeగ్యాలరీHealth tips: ఊబకాయంతో బాధపడుతున్నారా?.. అయితే, ఈ డ్రింక్‌ ట్రై చేసి స్లిమ్‌ అవ్వండి..!

Health tips: ఊబకాయంతో బాధపడుతున్నారా?.. అయితే, ఈ డ్రింక్‌ ట్రై చేసి స్లిమ్‌ అవ్వండి..!

Health tips For Control of Obesity: నేటి ఆధునిక యుగంలో ఊబకాయం సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. చిన్న వయస్సులోనే స్థూలకాయంతో బాధపడుతున్నారు చాలా మంది. బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాక నిట్టూరుస్తుంటారు. కొన్ని మందులు, ఇంజెక్షన్లు తీసుకొని అనారోగ్యం పాలవుతుంటారు. అలా కాకుండా కేవలం కొన్ని సింపిల్‌ ట్రిక్స్‌తో ఊబకాయం సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఎలాగో చూద్దాం.

ఊబకాయంతో బాధపడే వారి కోసం పోషకాహార నిపుణులు మ్యాజికల్ డ్రింక్స్‌ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ డ్రింక్స్‌తో సాధ్యమైనంత త్వరగా మీ ఫ్యాట్‌ను తగ్గించుకొని స్లిమ్‌గా తయారు కావొచ్చని చెబుతున్నారు.
ఈ డ్రింక్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మ్యాజికల్ డ్రింక్ తాగితే శరీరంలోని కొవ్వు త్వరగా ఎలా కరుగుతుంది. కేవలం 30 రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి.
ఈ బరువు తగ్గే డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి. మెంతులు 3 టీస్పూన్లు, పసుపు పొడి 3 టీస్పూన్లు, వాము 3 టీస్పూన్లు, సోంపు 3 టీస్పూన్లు, దాల్చిన చెక్క 2 తీసుకోవాలి. పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. తయారు చేసిన ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచాలి. ప్రతి రోజూ ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
ప్రతి భోజనానికి (లంచ్, డిన్నర్) 30 నిమిషాల ముందు.. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్ పొడి మిశ్రమాన్ని కలిపి తాగాలని నిపుణులు సూచించారు. దీంతో, చాలా తొందరగా ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad