Shraddha Srinath hot photos: ‘జెర్సీ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ ఇటీవల గ్లామర్ డోస్ బాగా పెంచింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో యూత్ మతి పోగొడుతోంది.

తాజాగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. బికినీలో ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

ఈ ఫొటోల్లో బికినీతో రచ్చ రేపుతోంది. ఓ ఫొటోలో అయితే బీర్ తాగుతుంది.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘మెకానిక్ రాకీ’ చిత్రాలతో ఆకట్టుకుంది.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించింది.

2016లో విడుదలైన కన్నడ చిత్రం ‘యూ టర్న్’ మూవీకి గాను ఆమె ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

ఇటీవలే ‘కలియుగం 2064’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది.
