మగువల అందాన్ని మరింత పెంచేది ఆకర్షణీయమైన శిరోజాలు. శిరోజాల రక్షణకు అతివలు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. అయితే చుండ్రు సమస్య జుట్టు పోషణను మరింత బలహీనపరుస్తుంది.
చుండ్రులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పొడి, మరొకటి జిగట. జిగట చుండ్రు ఉన్నవారు జుట్టుకి నూనే ఎక్కువగా పూయకూడదు. ఇక పొడి చండ్రు ఉన్నవారి చర్మంలో తేమ తక్కువగా ఉంటుంది.
చుండ్రు సమస్య వల్ల జుట్టు మూలాలు బలహీనపడటమే కాకుండా హెయిర్ రాలిపోవడం, చిట్లడం జరుగుతుంది. డ్యాండ్రఫ్ను నివారించడంలో మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ని కాకుండా ఇంట్లో సహజ చిట్కాలను వాడటం ఉత్తమం..
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న అల్లం, ఆమ్ల గుణాలు కలిగిన నిమ్మ.. ఈ రెండిటి మిశ్రమ సరైన మెడిసిన్గా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో సగం నిమ్మ కాయను పిండాలి.. మూడు అంగుళాల అల్లం ముక్కను చూర్ణం చేసి పిండి మిశ్రమాన్ని జుట్టు మూలాల వరకు అప్లై చేసుకోవాలి. అవసరమైతే ఉల్లి రసాన్ని వాడవచ్చు.
గంట తర్వాత జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం ద్వారా సత్ఫలితాలు కనిపిస్తాయి.
పుష్కలమైన నీరు తాగండి. వారానికి ఒకసారి పెరుగుతో జుట్టును ప్యాక్ చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా ఉంచుతుంది.