కొంతమందికి శరీరంపై అధికంగా పులిపిర్లు ఉంటాయి. ఇవి ప్రమాదకరమైనవి కాకపోయినా అప్పుడప్పుడూ చికాకు పుట్టిస్తాయి. తద్వారా నొప్పి, మంట, దురద కలుగుతాయి. ఇంట్లోనే దొరికే వాటితో వీటిని తొలగించవచ్చు.
బరువు అధికంగా ఉండడం, థైరాయిడ్, డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల సమస్యలు ఉన్నవారికి పులిపిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయట. అయితే వీటిని తొలగించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పులిపిర్లను తొలగిపోయేలా చేస్తాయి. పులిపిర్లు ఉన్న చోట బాగా కడిగి శుభ్రం చేసి తర్వాత.. ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేసి ఓ కాటన్ బ్యాండేజ్ వేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి దాన్ని పులిపిర్లపై ఉంచి బ్యాండేజ్‌లా వేయాలి. ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేయాలి. ఇది యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల పులిపిర్లు సులభంగా పోతాయి.
అరటి పండు తొక్క లోపలి భాగంలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉండటం వల్ల.. పులిపిర్లపై వేసి కట్టులా కూడా కట్టుకోవచ్చు. అవసరం అయితే పట్టీ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి ఉదయం తీసేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
మార్కెట్లో లభించే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తెచ్చి లోపలి ద్రవాన్ని రోజూ పులిపిర్లపై రాసినా ఫలితం ఉంటుంది.
చిన్న అల్లం ముక్క లేదా రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి మెత్తని పేస్ట్‌లా చేసి మిశ్రమాన్ని పులిపిర్లపై పెట్టి బ్యాండేజ్ వేయాలి. ఇలా రోజూ రాత్రి మజాస్ చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయడం ద్వారా సమస్య తీరుతుంది. అయితే కళ్లపై పులిపిర్లు ఉంటే మాత్రం సొంత వైద్యం పనికి రాదు. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.